అమెరికా ఖైదీలకు సాల్వడార్​ బంపరాఫర్​

అమెరికా ఖైదీలకు సాల్వడార్​ బంపరాఫర్​
  • డబ్బులిస్తే మీ నేరస్థులను మా జైల్లో పెట్టుకుంటం  
  • అమెరికాకు సాల్వడార్ ఆఫర్

వాషింగ్టన్: అమెరికా నుంచి బహిష్కరణకు గురైనవాళ్లతోపాటు, అమెరికన్ నేరస్థులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తమ జైల్లో ఉంచేందుకు సిద్ధమని ఎల్ సాల్వడార్ ప్రకటించింది. ఇందుకు కొంత సొమ్ము వసూలు చేస్తామని చెప్పింది. దీనికి సంబంధించిన డీల్​ ​అమెరికాతో కుదిరిందని ఆ దేశ ప్రెసిడెంట్ నయీబ్ బుకెల్ తెలిపారు. 

అక్రమంగా అమెరికాకు వచ్చినోళ్లు, వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో ఉంటున్న విదేశీయులు వాళ్ల సొంత దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే స్పష్టం చేశారు. అధికారులు కూడా ఏరివేత చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అక్రమ వలసదారులను ఖైదు చేసే విషయంపై అమెరికా మంత్రి రూబియోతో చర్చించామని సాల్వడార్ ప్రెసిడెంట్​ తెలిపారు.