- ఆయన నాయకత్వం మీద నమ్మకం లేదన్న కంపెనీ బోర్డ్
న్యూఢిల్లీ: చాట్ జీపీటీ డెవలప్ చేసిన శామ్ అల్టమాన్‌ను సీఈఓ పదవి నుంచి ఓపెన్ ఏఐ బోర్డ్ తీసేసింది. అతని నాయకత్వంపై నమ్మకం లేదని పేర్కొంది. ఓపెన్ ఏఐని 2015 లో శామ్ ఆల్ట్‌మాన్ ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్ నుంచి ఫండింగ్ రావడంతో ఈ కంపెనీని వేగంగా ఎదుగుతున్న టెక్ కంపెనీగా తీర్చిదిద్దారు. ఓపెన్ ఏఐ కోసం టెస్లా బాస్ ఎలన్ మస్క్‌తో ఆయన కలిసి పనిచేశారు కూడా. తర్వాత మస్క్ సంస్థ నుంచి బయటకొచ్చేశారు.
తాజాగా ఎక్స్‌ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీని పెట్టారు. ఇండస్ట్రీ ఏఐ వైపు షిఫ్ట్ అవ్వడంపై ఆల్ట్‌మాన్ పని చేశారు. యూఎస్ కాంగ్రెస్, ఇతర గ్లోబల్ లీడర్లతో కలిసి చర్చలు జరిపారు. చాట్ జీపీటీ ఒక టెక్ రివల్యూషన్ అని కూడా చాలా మంది పొగిడారు. ఏఐపై కంపెనీలకు, సాధారణ జనానికి ఆసక్తి పెరగడంలో ఆల్ట్‌మాన్ కీలకంగా పనిచేశారని చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ డాలర్ల ఫండింగ్ సేకరించి సిలికాన్ వ్యాలీలో వేగంగా ఎదుగుతున్న టెక్ కంపెనీగా ఓపెన్ ఏఐని తీర్చి దిద్దారు. చాట్ జీపీటీ విడుదలయ్యాక ఓపెన్ ఏఐకి బ్రాండ్ అంబాసిడర్‌గా శామ్ ఆల్ట్‌మాన్ మారారు. ఏఐలో పెద్ద కంపెనీలతో పోటీ పడ్డారు.
ఓపెన్ ఏఐ సీఈఓగా కంపెనీని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎంప్లాయీ షేర్స్‌ను 86 బిలియన్ డాలర్లకు కొనేందుకు బయ్యర్లు ఉన్నారంటేనే కంపెనీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. చాట్ జీపీటీ, డాల్–ఈ, ఓపెన్ ఏఐ ఇమేజ్ జనరేటర్ వంటివి జనరేటివ్ ఏఐ సెగ్మెంట్‌కు మార్గం చూపాయి. ‘ఓపెన్ ఏఐలో గడిపిన ప్రతీ నిమిషం సంతోషాన్ని ఇచ్చింది. నన్ను చాలా మార్చింది.
ప్రపంచాన్ని కూడా ఎంతో కొంత మార్చిందని నమ్ముతున్నాను. ట్యాలెంట్ ఉన్న వ్యక్తులతో పని చేయడం నచ్చింది’ అని ఆల్ట్‌మాన్ ట్వీట్ చేశారు. ఆల్ట్ మాన్ వెళ్లిపోవడంతో కోఫౌండర్ గ్రెగ్ బ్రాక్‌మాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఓపెన్ ఏఐకి ఇంటెరిమ్ సీఈఓగా మిరా మురాటి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.