
OpenAI స్టూడియో జిబ్లీ.. ఇప్పుడు సోషల్ మీడియా దీనిగురించే పెద్ద చర్చ. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీలో జిబ్లీ స్టూడియో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోటోలను జిబ్లీ స్టైల్‌లో కార్టూన్‌లుగా మార్చుకోవచ్చు.ఈ ఫీచర్ యూజర్లను బాగా ఆకర్షిస్తోంది.ప్రధాని మోదీ ఫొటోలనుంచి సామాన్యుల దాకా జిబ్లీ స్టైల్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. Open AI చాట్‌జీపీటీలో ఈ ఫీచర్ వచ్చిన తర్వాత యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో సర్వర్ల పై భారం పడడం వల్ల రోజుకి ఒక యూజర్ కి మూడు ఫోటోలు మాత్రమే జిబ్లి శైలిలోకి మార్చుకోవడానికి లిమిట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : వాట్సాప్ కొత్త ఫీచర్..స్టేటస్ అప్డేట్లో మ్యూజిక్
సోషల్ మీడియా AI-జనరేటెడ్ స్టూడియో గిబ్లి-స్టైల్ సక్సెస్ కావడంతో OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గిబ్లి-స్టైల్ చిత్రాలతో నిండిపోతోంది.. ప్రొఫైల్ చిత్రాలు, మీమ్స్, సినిమా పోస్టర్లలో కూడా వెలిగిపోతోంది. .మైడియర్ టీమ్ మెంబర్స్ ఇక మీరు రెస్ట్ తీసుకోవచ్చు అంటూ X లో పోస్ట్ షేర్ చేశారు. ఈ ఫీచర్ తో యూజర్ల సంఖ్య పెరగడంతో ఫ్లోటింగ్ ను కంట్రోల్ చేసేందుకు OpenAI ఇమేజ్ జనరేషన్ లిమిట్స్ పెట్టింది.ChatGPT Plus, Pro, Team ,Select యూజర్లతో సహా చెల్లింపు సబ్‌స్క్రైబర్లకు ఇప్పటికీ యాక్సెస్ ఉంది. కానీ గతంలో అన్ లిమిటెడ్ యాక్సెస్ ఉన్న ఫ్రీ-టైర్ యూజర్లకు ఇప్పుడు రోజుకు మూడు చిత్రాలకే పరిమితం చేశారు.
ఫ్లోటింగ్ తో కంపెనీ GPUలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) ఒత్తిడిలో ఉన్నాయి. ఈ ఫీచర్ ను మరింత సమర్థవంతంగా తయారు చేయడంలో బృందం కృషి చేస్తుంది. కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్.