ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ న్యూ లుక్..30 ఏళ్ళ తర్వాత క్రికెట్‌లో ఇదే తొలిసారి

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ న్యూ లుక్..30 ఏళ్ళ తర్వాత క్రికెట్‌లో ఇదే తొలిసారి

క్రికెట్ లో బౌలింగ్ వేస్తూ, ఫీల్డింగ్ చేస్తూ సన్ గ్లాస్ పెట్టుకునేవాళ్లను మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం విచిత్రంగా సన్ గ్లాస్ పెట్టుకొని బ్యాటింగ్ కు దిగాడు. ఇదేదో గల్లీ మ్యాచ్ అనుకుంటే పొరపాటే. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ప్లేయర్ సన్ గ్లాస్ పెట్టుకొని బ్యాటింగ్ చేయడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1990లో విండీస్ ఆటగాళ్లు బ్రియాన్ లారా, జాక్ రస్సెల్‌ ఇలా చేసేవారు.       

ఆదివారం ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..39వ ఓవర్‌లో 232 పరుగుల వద్ద 6 వ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ సన్ గ్లాస్ పెట్టుకొని ప్రత్యేక అవతారంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఇది చూసిన ప్రేక్షకులు, కామెంటేటర్లు కాసేపు నవ్వుకున్నారు. గతంలో సన్ గ్లాసెస్‌తో బ్యాటింగ్ చేసిన బ్రియాన్ లారా, జాక్ రస్సెల్‌లను  ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ గుర్తు చేసాడు.

ఇక ఈ మ్యాచ్ లో  26 బంతుల్లో 3 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఇంగ్లండ్ కు విలువైన పరుగులు చేసాడు. అయితే బౌలింగ్ లో మాత్రం కరన్ దారుణంగా విఫలమయ్యాడు. 9.5 ఓవర్లలో 98 పరుగులు సమర్పించుకున్నాడు. కరన్ వేసిన 49వ ఓవర్లో 3 సిక్సర్లతో వెస్టిండీసీ మ్యాచ్ ను ముగించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 325 పరుగులు చేస్తే.. విండీస్ 48.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. విండీస్ కెప్టెన్ హోప్ 83 బంతుల్లో 7 సిక్సులు, 4 ఫోర్లతో అజేయంగా 109 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు.