న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (ఈవీఎం) హ్యాకింగ్ చేసే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ నేత శాం పిట్రోడా. నేను 60 ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఐటీ, సాఫ్ట్ వేర్,కాంప్లెక్స్ సిస్టమ్స్ వంటి మరెన్నో రంగాల్లో కీలకంగా ఉన్నాను..ఈవీఎం వ్యవస్థను జాగ్రత్తగా అధ్యయనం చేశారు..ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్య మేనని పిట్రోడా అన్నారు. సాంప్రదాయ బ్యాలెట్ ఉత్తమ విధానం అని సోషల్ మీడియా ప్లాట్ ఫాంX లో ఓ పోస్ట్ షేర్ చేశారు పిట్రోడా.
టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో ప్రఖ్యాతిగాంచిన శామ్ పిట్రోడా మేనెలలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పిట్రోడా తాను చేసిన వివాస్ప ద ప్రకటనను బాధ్యునిగా వైదొలగాని నిర్ణయం తీసున్నారు. తూర్పు దేశం ప్రజలు చైనీస్ లాగా , దక్షిణాది ప్రజలు ఆఫ్రికా లా గా కనిపిస్తారని పిట్రోవ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఆయన రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. AI లేదా మనుషుల ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు ఎలాన్ మస్క్.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. జవాబుదారీ తనం లోపించినపుడు , ప్రజాస్వామ్యం కేవలం ముఖ భాగంగా మాత్రమే ఉంటుందన్నారు. మోసపూరిత చర్యలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గత కొంతకాలంగా ఈవీఎంలపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. వీవీప్యాట్ లను 100 శాతం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాయి.