కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం .. శామ్ పిట్రోడాకి కీలక పదవి

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం ..  శామ్ పిట్రోడాకి  కీలక పదవి

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.  వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారిన  శామ్ పిట్రోడాను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా తిరిగి నియమించింది . ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.  కాగా 2024 మేలో   పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు.  తూర్పు ప్రాంతంలోని భారతీయులు చైనీయులను పోలి ఉంటారని, దక్షిణాదిలో ఉన్నవారు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆమోదించారు.  శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడంతో  కాంగ్రెస్ ఆయన ప్రకటనలకు దూరంగా ఉంది. అంతేకాకుండా వాటిని ఆమోదయోగ్యం కాదు అని పేర్కొంది. పిట్రోడా పూర్తి పేరు సత్యన్నారాయణ గంగారామ్ పిట్రోడా.