నిర్మాత కేదార్ మృతిపై ఎందుకు స్పందించలేదు : సామ రామ్మోహన్ రెడ్డి

నిర్మాత కేదార్ మృతిపై  ఎందుకు స్పందించలేదు : సామ రామ్మోహన్ రెడ్డి

కేటీఆర్​ను ప్రశ్నించిన సామ రామ్మోహన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా జరిగిన క్షణాల్లో స్పందించే కేటీఆర్..దుబాయ్ లో సినీ నిర్మాత కేదార్ చనిపోతే ఎందుకు స్పందించలేదని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేదార్ మీకు పరిచయమా..? మీ బావ మరిది రాజ్ పాకాలకు కేదార్ తో దగ్గరి సంబంధం ఉందని గతంలో జరిగిన ప్రచారం నిజమా.. కాదా’ అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల పాపాలపై పోరాటం చేసిన వారు వరుసగా చనిపోతున్నారని ఆరోపించారు. దుబాయ్ ఘటనపై కేటీఆర్ స్పందించాలని కోరారు.