ఎల్బీనగర్లో సుధీర్ రెడ్డి కబ్జాలకు అడ్డూ అదుపులేదు: సామ రంగారెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డు అదుపులేకుండా పోతుందని  రంగారెడ్డి జిల్లా  బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి కోర్టు దగ్గర గల  సర్వే నెంబర్ 13,14,15 లోని ఎకరం 25 గుంటల ప్రభుత్వ భూమి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బినామీ కంపెనీ TNR పేరు మీద రిజిస్టర్ అయిందని తెలిపారు. సెక్షన్ 172  1975 ప్రకారం ప్రభుత్వం ఏదైనా సంస్థకు దాని అవసరాలకు ఇచ్చిన భూమిని ఉపయోగించుకోకుండా ఉంటే ఆ భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పాలన్నారు. కానీ ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డి మాత్రం...ప్రభుత్వానికి  అప్పగించకుండా తన బినామీ కంపెనీ అయిన  TNR పేరు మీదు  రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.

ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారని సామ రంగారెడ్డి విమర్శించారు. సుధీర్ రెడ్డి కబ్జాలకు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఆరోపించారు. సుధీర్ రెడ్డి చేసిన కబ్జాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తామన్నారు.