జగన్ ఫోటోతోనే విద్యాకానుక పంపిణీపై క్లారిటీ

ఏపీలో ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులేస్తోంది.4వసారి ఏపీ సీఎంగా బయటలు స్వీకరించిన చంద్రబాబు మెగా డీఎస్సి సహా 5ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా, స్కూళ్ళు ప్రారంభమైన నేపథ్యంలో జగన్ హయాంలో ప్రారంభించిన విద్యాకానుక పంపిణీపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చే కిట్ పై జగన్ ఫోటోతోనే పంపిణీ జరుగుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించింది సమగ్ర శిక్ష అభియాన్. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జగన్ ఫోటో ఉన్న స్టూడెంట్ కిట్లనే పంపిణీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది సమగ్రశిక్ష అభియాన్. 2024 - 25విద్య సంవత్సరానికి గాను సరఫరా చేసే వస్తువులపై ఎలాంటి రాజకీయ చిహ్నాలు కానీ, ఫోటోలు కానీ ముద్రించొద్దని గత మార్చిలోనే కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చామని తెలిపింది. తమ ఆదేశాలకు అనుగుణంగానే వాటి తయారీ, పంపిణీ జరుగుతోందని, పాత స్టాక్ ఉంటే పంపిణీ చేయొద్దని కూడా ఆదేశాలిచ్చినట్లు తెలిపింది సమగ్రశిక్ష అభియాన్.