- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కోరిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని షబ్బీర్ అలీ ఇంట్లో ఉద్యోగులు ఆయనను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో సమగ్ర శిక్షణ కాంట్రాక్టు ఉద్యోగులు కీలకంగా పని చేస్తున్నారని, వారిని రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు రాములు, కాళిదాస్, లింగం, మహమ్మద్, దినేష్, నవీన, లావణ్య ఉన్నారు.