ఖమ్మం టౌన్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి గతంలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఐదోరోజు కొత్త కలెక్టరేట్ ధర్నా చౌక్ లో రిలేదీక్షను చేపట్టారు. తమను పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రీ ఎంగేజ్ విధానం తొలగించి, ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలన్నారు.
పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగుల వలే 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా రూ.10 లక్షలు, పదవీ విరమణ బెనిఫిట్స్ కింద మరో రూ.10 లక్షలు అందించాలని కోరారు. టీఎస్ టీటీఎఫ్, టీఎస్ యూటీఎఫ్, ఏఐఎస్ఎఫ్, సీఐటీయూ టీచర్స్, విద్యార్థి సంఘాలు నాయకులు మద్దతు తెలిపారు. కేజీబీవీ విజయలక్ష్మి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ కే.అనిల్ కుమార్, సీఆర్ పీ లచ్చిరాం కృష్ణ ప్రసాద్, మెసెంజర్ ఎస్ కే ఇస్మాయిల్ పాల్గొన్నారు .