ఏడో రోజుకు చేరిన ఉద్యోగుల దీక్ష

ఏడో రోజుకు చేరిన ఉద్యోగుల దీక్ష

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ కలెక్టరేట్​ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష సోమవారం ఏడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ దీక్షను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలని, మినిమం టైం స్కేల్​అమలు చేయాలని డిమాండ్​చేశారు. దీక్షలో నాయకులు బ్రహ్మచారి, జి.పద్మ, రవికుమార్, సత్య, రమేశ్, సాంబశివరావు పాల్గొన్నారు.