యాదాద్రి, వెలుగు : ఏండ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి కలెక్టరేట్వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం 17 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యాశాఖలో పని చేస్తున్న తమకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. సమ్మెలో ఉద్యోగులు తిరుపతి, కవిత, శ్రావణ్, కృష్ణ, యాకయ్య, చైతన్య, మోహనాచారి తదితరులు పాల్గొన్నారు.
అరటి పండ్లను అమ్ముతూ నిరసన..
నల్గొండ అర్బన్, వెలుగు : విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, రాజు ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెలో ఉద్యోగులు అరటి పండ్లు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు.