హిలేరియస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రెబా మోనికా జాన్ హీరోయిన్‌‌‌‌. ఏప్రిల్ 27వ తేదీన గురువారం టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘హిలేరియస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది. మెదడుకి పెద్ద పని లేకుండా సరదాగా నవ్వించే సినిమా. నిర్మాత రాజేష్ దండా ఈ కథతో వచ్చినపుదు మారేడుమిల్లి ప్రజానీకం, భైరవ కోన తరహాలో ఉంటుందనుకున్నా. కానీ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉన్న సూపర్ ఫన్ సబ్జెక్టు చెప్పారు. ప్రేక్షకులు రెండుగంటల పాటు ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు.

‘శ్రీవిష్ణుతో కలిసి నటించడం హ్యాపీ. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత​లకు థ్యాంక్స్’ అని  రెబా మోనికా జాన్ తెలిపింది. అనిల్ సుంకర మాట్లాడుతూ ‘శ్రీవిష్ణు ఎంచుకునే కథలు యూనిక్ గా వుంటాయి.  ఇది కూడా కొత్త కాన్సెప్ట్‌‌‌‌తో రూపొందిన ఎంటర్ టైనర్. మొదటి నుంచి చివరి వరకూ నవ్వుతూనే వుంటారు‘ అని అన్నారు. ‘ఫ్యామిలీ అంతా కలసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌‌‌‌లో ఉంటుంది. రెబ్బా చక్కగా నటించింది’ అన్నాడు దర్శకుడు.

రాజేష్ దందా మాట్లాడుతూ ‘కథ వినగానే నాన్‌‌‌‌ స్టాప్‌‌‌‌గా నవ్వుతూనే ఉన్నాను. దర్శకుడు చెప్పిన దాని కంటే బాగా తీశాడు’ అని చెప్పాడు.  ‘చాలా ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ ఇచ్చాను’..అని అన్నాడు గోపీ సుందర్. మే 18న సినిమా విడుదల కానుంది.