లవ్‌‌ ఫ్యాంటసీలో పడిపోయేలా..

లవ్‌‌ ఫ్యాంటసీలో పడిపోయేలా..

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రెబా మోనికా జాన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. బుధవారం ఈ చిత్రం నుంచి ‘హోలా రే హోలా’ అనే పాటని విడుదల చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటను జెవి సుధాన్షు, సోనీ కొమందూరి పాడారు. ‘ధక్ ధక్ ధునియా.. కొత్తగుంది చెలియా.. కన్ఫర్మ్‌‌గా నీదే ఈ మాయ.. ఇష్టమైన పిల్లా.. ఫస్ట్ కిస్ ఇచ్చే.. కోమాలోకే మనసెళ్లేలా.. హోలారే హోలా.. ఫస్ట్ టైమ్‌‌ ఈవాళ.. లవ్‌‌ ఫ్యాంటసీలో పడిపోయేలా’ అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, దేవి ప్రసాద్, ప్రియ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 29న  విడుదల కానుంది.