యూపీలో బీజేపీకి ఝలక్ ఇచ్చిన మినిస్టర్

యూపీలో బీజేపీకి ఝలక్ ఇచ్చిన మినిస్టర్

ఎన్నికల వేళ యూపీలో బీజేపీకి షాక్ తగిలింది. యూపీ కేబినెట్ మినిస్టర్ ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య పదవి బీజేపీకి  రాజీనామా చేశారు. దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగుల పట్ల యోగీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే తన రాజీనామాకు కారణమని చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మరో సీటు కావాలని మౌర్య డిమాండ్ చేయగా.. పార్టీ అందుకు అంగీకరించకపోవడంతోనే రాజీనామా చేశారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

బీజేపీకి గుడ్ బై చెప్పిన వెంటనే స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను కలిశారు.  తన మద్దతుదారులతో కలిసి ఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడుతున్న నేత స్వామి ప్రసాద్ మౌర్య, ఆయన సహచరులకు స్వాగతం పలుకుతూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. 

 

మరిన్ని వార్తల కోసం..

అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి దూరం

హ‌రిద్వార్ లో పుణ్య‌స్నానాల‌పై ఉత్త‌రాఖండ్ క‌ఠిన ఆంక్ష‌లు