కుంభమేళా తొక్కిసలాట..మృతుల సంఖ్య దాస్తున్నరు..అఖిలేశ్ ఫైర్

కుంభమేళా తొక్కిసలాట..మృతుల సంఖ్య దాస్తున్నరు..అఖిలేశ్ ఫైర్
  • కుంభమేళా తొక్కిసలాటలో యూపీ ప్రభుత్వంపై అఖిలేశ్ ఫైర్

న్యూఢిల్లీ: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాస్తున్నదని సమాజ్​వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. 30 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారని అనుమానం వ్యక్తం చేశారు. 

పరిహారం చెల్లించకుండా అధికారులు తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సెషన్​లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మృతుల సంఖ్య విషయంలో పారదర్శకత పాటించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదు. 

మృతుల కుటుంబాలకు వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలి. ఎంతమంది చనిపోయారు.. వారి పేర్లతో జాబితాను రిలీజ్ చేయాలి” అని అఖిలేశ్​ యాదవ్​ డిమాండ్ చేశారు.