ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘సమాజ్ వాదీ’ని గెలిపించాలి : ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘సమాజ్ వాదీ’ని గెలిపించాలి : ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి
  • ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి

ముషీరాబాద్, వెలుగు: వెనుకబడిన తరగతుల అభ్యున్నతికే సమాజ్ వాదీ పార్టీ కృషి చేస్తున్నదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి కోరారు. తెలంగాణలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో పార్టీ తరఫున ఇద్దరిని పోటీలో నిలిపినట్లు తెలిపారు. చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ నిమ్మ తోట వెంకటేశ్వర్లు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్యను గెలిపించాలని కోరారు. ఉన్నత విద్యావంతులైన వీరు గత 30 ఏండ్లుగా సమాజ సేవలో ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమం, బీసీ, బహుజన ఉద్యమాలు, నిరుద్యోగ- ఉపాధ్యాయ పోరాటాల్లో పాల్గొంటూ రాజ్యాంగ స్థాపనకై పాటు పడుతున్నారని చెప్పారు.