‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత సమంత హిందీలో నటిస్తున్న మరో వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన మేకర్స్, బుధవారం మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లోకి సమంతకు వెల్‌కమ్ చెబుతూ తన క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. లెదర్ జాకెట్, డెనిమ్ జీన్స్, కూలింగ్ గ్లాసెస్‌తో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తోంది సమంత. హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో లేడీ జేమ్స్ బాండ్‌లా ఇంప్రెస్ చేస్తోందామె.
మయో సైటిస్ కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ఆమె.. రీఎంట్రీలో అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సర్‌ప్రైజ్ చేసింది. అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇది ఇండియన్ వెర్షన్. అక్కడ ప్రియాంక చోప్రా చేసిన ఏజెంట్ నాదియా సింగ్ పాత్రను ఇక్కడ సమంత పోషిస్తోంది. ఈ స్ప్రై థ్రిల్లర్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవగానే నార్త్ ఇండియాతో పాటు సెర్బియా, సౌత్ ఆఫ్రికాలో షూట్ జరగనుంది. ఇదిలా ఉంటే త్వరలోనే ‘ఖుషి’ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవబోతున్నట్టు చెప్పింది సమంత. తన కారణంగా షూటింగ్ ఆలస్య మవడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెబుతూ ట్వీట్ చేసిందామె. మరోవైపు సమంత లీడ్ రోల్‌లో గుణశేఖర్ రూపొంది స్తున్న ‘శాకుంతలం’ త్వరలో విడుదల కానుంది.