సమంత 'సిటాడెల్: హనీ బన్నీ' ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అదిరిందిగా

తెలుగు ప్రముఖ హీరోయిన్ సమంత సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్న విషయం తెలిసందే. ఈ వెబ్ సీరీస్ లో బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రాజ్ & డికె (రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె) తెరకెక్కించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన డి2ఆర్ ఫిల్మ్స్ మరియు అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ కలసి సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఇటీవలే సిటాడెల్ ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం.. 

సమంత మరియు వరుణ్ ధావన్ స్పై ఏజెంట్స్ హనీ బన్నీ పాత్రల్లో నటించారు. దీంతో మొదటగా భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో రోజుకో కొత్త సమస్య వస్తోందని కానీ ఈ సమస్యలని ఎదుర్కోవడం పెద్ద సమస్యని వరుణ్ ధావన్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక యాక్టర్ అవ్వాలనుకున్న సమంత స్పై ఏజెంట్ అలా అయిందనే విషయాలు సీరీస్ పై ఆసక్తిని పెంచాయి.

ALSO READ | సైబర్ క్రైమ్ I4C అంబాసిడర్ గా నేషనల్ క్రష్ రష్మిక మందాన.

అయితే ఎప్పుడూ కూల్ హీరోయిన్ గా గ్లామర్ పాత్రల్లో కనిపించిన సమంత ఈసారి సిటాడెల్ లో డిఫరెంట్ రోల్ లో యాక్షన్ క్వీన్ గా కనిపించింది. అయితే యాక్షన్ సన్నివేశాలు, కొంచెం ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సీరీస్ నవంబర్ 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్రైమ్ వీడియొస్ లో ప్రసారం కానుంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి సమంత కేవలం గ్లామర్ పాత్రల్లో మాత్రమే కాకుండా వెబ్ సీరీస్లలో కూడా నటించేందుకు ఒకే చెబుతోంది. మరోవైపు వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో సమంత సినిమాలు, వ్యాపరాలు అంటూ బిజీబిజీగా గడుపుతోంది.