నాగచైతన్య- శోభిత రిలేషన్షిప్ వార్తలు.. నేనలా అనలేదంటూ సమంత ట్వీట్

గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇందులో  లీడ్ రోల్ పోషిస్తున్న సమంత.. ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ప్రమోషన్లలో పాల్గొంటోంది. అయితే, ఈ హీరోయిన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య.. నటి శోభితా ధూళిపాలతో రిలేషన్లో ఉన్నాడనే రూమర్లు గుప్పుమంటున్నాయి.  వీరిద్దరినీ ఉద్దేశించి సమంత వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆమె ఈ విషయంపై స్పందించింది. ‘నేను అలా అనలేదు-’ అంటూ తనపై వస్తోన్న వార్తలను ఖండించింది. ఆ రూమర్లకు సంబంధించి వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ను ట్విటర్లో షేర్ చేసింది. 

‘‘ఎవరు ఎవరితో రిలేషన్లో ఉన్నా అది నన్ను బాధించదు. ప్రేమ విలువ తెలియని వారు ఎంత మందిని ప్రేమించినా వారికి చివరకు మిగిలేవి కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయైనా సంతోషంగా ఉంటే అంతే చాలు..--’’ అని సమంత అన్నట్టుగా  ఆ ఫేక్ న్యూస్ లోని సారాంశం. తమ విడాకులపై నాగ చైతన్య గతంలో ఓ ఇంటర్వ్యూలోనే క్లారిటీ ఇచ్చాడు. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలిపాడు. ఒకవేళ అవకాశం వస్తే సమంతతో తిరిగి నటించేందుకు సిద్ధమని అన్నాడు. ఏ మనిషికైనా ప్రేమ అనేది ఎంతో అవసరమని తాను తిరిగి ప్రేమలో పడే అవకాశాలు లేకపోలేదు అంటూ స్పష్టం చేశాడు. ఇక నాగచైతన్యతో రూమర్ల కారణంగా వార్తల్లో నిలిచిన శోభిత ఓ తెలుగమ్మాయి. అడవి శేష్ ‘మేజర్’, మణిరత్నం ‘ పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాల్లో నటించింది.