సౌత్ బ్యూటీ సమంత(Samantha) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇటీవల తెలుగులో ఖుషీ(Kushi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె డీసెంట్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తరువాత మరో తెలుగు సినిమాను ప్రకటించని సామ్.. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. నిజానికి సమంత తెలుగు సినిమా చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రెజెంట్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న న్యూస్ వింటుంటే సమంత అభిమానుల ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడేలానే కనిపిస్తోంది.
అవును.. సమంత త్వరలోనే తెలుగులో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వనున్నారట. అది కూడా చిన్న హీరోతో కాదు.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో. ఆ స్టార్ మరెవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). తమిళ దర్శకుడు అట్లీ(Atlee) అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోనున్నారట మేకర్స్. అల్లు అర్జున్, సమంత గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేసిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మంచి విజయాన్ని సాధించింది.
ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాలో ఊ అంటావా మామ పాటలో మరోసారి తెరపై జంటగా కనిపించారు. కానీ, హీరోహీరోయిన్ గా దాదాపు పదేళ్ల తరువాత తెరపైకి వస్తున్నారు సమంత, అర్జున్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇక షారుఖ్ తో జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు అట్లీ నుండి వస్తన్న నెక్స్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.