
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బెల్లంకొండ సురేష్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి అలరించాడు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలసి పనిచేశాడు. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా కొంతకాలంపాటూ ఇండస్ట్రీకి దూరమయ్యాడు.. అయితే ఇటీవలే నిర్మాత సురేష్ ఓ ఇంటర్వూ తన సినీ అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాల్ని ఆడియన్స్ తో పంచుకున్నాడు.
ఈక్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తాను ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ ఇప్పటికీ మంచి సన్నహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే సమంత నేటితరం హీరోయిన్ల మాదిరిగా కాదని చేసిన మేలుని గుర్తు పెట్టుకుని ఆప్యాయంగా పలకరించే మనిషి అని తెలిపాడు. అయితే ఓసారి సమంతకి చర్మ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమయంలో ట్రీట్ మెంట్ కి డబ్బు అవసరం కాగా తానె ఆర్ధిక సాయం అందించానని చెప్పుకొచ్చాడు.
ALSO READ | Court Box Office: నాని మూవీకి లాభాల వర్షం.. ఐదు రోజుల కలెక్షన్లు ఇవే..
ఇక సమంతకి ఫామ్ హౌజ్ గిఫ్ట్ ఇచ్చిన విషయంపై కూడా స్పందిస్తూ అల్లుడు శీను సినిమాలో నటించే సమయంలో సమంత రెమ్యునరేషన్ కి బదులుగా తన ఖరీదైన ఫార్మ్ హౌజ్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిపాడు. అయితే అప్పటికే తనకి రెండు ఫార్మ్ హౌస్ ఉన్నాయని దీంతో ఒకటి సమంతకి చూపించగా ఆమె చాలా ఇష్టపడిందని అందుకే ఇచ్చేశానని చెప్పుకొచ్చాడు. అప్పట్లోనే ఆ ఫార్మ్ హోస్ వాల్యూ దాదాపుగా రూ. కోటిన్నర పైగా ఉండేదని ఇప్పుడైతే రూ.15 నుంచి రూ.18 కోట్లు పైగానే ఉంటుందని వెల్లడించాడు.
ఈ విషయం ఇలా ఉండగా బెల్లంకొండ సురేష్ 2014లో అల్లుడు శీను, రభస చిత్రాల్ని నిర్మించాడు. ఇందులో అల్లుడు శీను సూపర్ డూపర్ హిట్ కాగా.. రభస సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ నిర్మాత సురేష్ ఇండస్ట్రీలో ఇనాక్టివ్ అయ్యారు.