Samantha: సమంత మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా?.. సామ్ సమాధానమిదే!

Samantha: సమంత మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా?.. సామ్ సమాధానమిదే!

బ్యూటీ సమంత, హీరో వరుణ్ ధావన్ నటించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'సిటడెల్: హనీ బన్నీ' (Citadel Honey Bunny). ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గురువారం (నవంబర్ 7) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుంది. 

ఈ నేపథ్యంలో సమంత వరుస ప్రమోషన్స్ తో దూసుకెళ్తోంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన పర్సనల్ లైఫ్ అండ్ సెకండ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

' మీరు మరో ఐటెం సాంగ్ చేసే అవకాశముందా? అనే ప్రశ్న జర్నలిస్టు నుండి ఎదురవ్వగా 'ఇకపై స్పెషల్ సాంగ్స్ చేయను' అంటూ సమాధానమిచ్చింది. అలాగే మీరు సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారా అని అడగగా.. 'ఉండను' అంటూ చెప్పింది. దాంతో సమంత ఎవరితో అయిన రిలేషన్లో ఉందా లేక త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ లేటెస్ట్ వీడియోతో.. పుష్ప 2 ఐటం సాంగ్‌లోనూ సమంత కొన్ని సెకన్లు కనిపిస్తుందనే వార్తలు జస్ట్ రూమర్స్ అని కన్ఫర్మ్ అయింది. నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయిన సామ్.. త్వరలో మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఉండే ఉంటుందని టాక్. ఇక ఏమవుతుందో చూడాలి.

ఇకపోతే ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంతతో పాటు సిటాడెల్‌లో నటించిన సికందర్ ఖేర్, కెకె మీనన్ మరియు షకీబ్ సలీమ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సిరీస్‌ను భారత్‌తో పాటు సైబీరియాలో కూడా చిత్రీకరించారు. ఈ సిరీస్‌లో సమంత పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించబోతోంది.