ఈ 13 ఏళ్లలో బాగానే సంపాదించింది.. సమంత ఆస్తి ఎంతంటే..

ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది సమంత. ఆ సినిమా ఫెయిల్ అయినా.. సమంత సినీ కెరీర్ ను మార్చిందనే చెప్పొచ్చు. ఛాలెంజింగ్, గ్లామర్ రోల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.

సౌత్ లో సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే, సమంత తన మార్కెట్ ను పెంచిందన్న విషయం తెలిసిందే. ప్రతీ సినిమాకు తన రెమ్యూనరేషన్ లో ఏ మాత్రం రాజీ పడటం లేదు.

ఈ క్రమంలో సమంత ఆస్తి విలువ ఎంత? అనే అంశం చర్చలోకి వచ్చింది. 13 ఏళ్ల సినీ కెరీర్ లో తనకంటూ సొంత ఆస్తిని బాగానే కూడ గట్టుకుంది. సమంత ప్రస్తుతం ఒక సినిమాకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

పుష్ప సినిమాలో నటించిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ కు రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందట. ప్రస్తుతం సమంత ఆస్తి రూ. 101 కోట్లు దాటి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

తన దగ్గర రూ.2.26 విలువైన రేంజ్ రోవర్, రూ. 1.46 కోట్లు విలువైన పోర్షే, ముంబైలో రూ. 15 కోట్ల విలువ చేసే ఫ్లాట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఉన్నాయని సమాచారం. అవికాకుండా నాగ చైతన్యతో ఉన్న ఇల్లును ఇష్టంతో సమంత తిరిగి కొనుగోలు చేసింది.