ఫాంటసీ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో.. సమంత

ఫాంటసీ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో..  సమంత

వరుస ప్రాజెక్ట్స్‌‌‌‌తో తిరిగి ఫుల్ బిజీ అవబోతోంది సమంత.  అనారోగ్య కారణాలతో కెరీర్‌‌‌‌‌‌‌‌లో చిన్న గ్యాప్‌‌‌‌ తీసుకుని, షూటింగ్స్‌‌‌‌కు దూరంగా ఉంటున్న ఆమె..  వచ్చే నెల నుంచి సెట్స్‌‌‌‌లో అడుగుపెట్టబోతున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.  అయితే అది ఏ ప్రాజెక్ట్ అనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే..  తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్‌‌‌‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.  

తుంబాడ్‌‌‌‌’ అనే హారర్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తో మెప్పించిన రాహి అనిల్ బార్వే దీనికి దర్శకుడు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌ 2, సిటాడెల్‌ వెబ్ సిరీస్‌‌‌‌లు తీసిన రాజ్‌‌‌‌ అండ్ డీకే దీనికి షో రన్నర్స్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్‌‌‌‌కు ‘రక్త బ్రహ్మాండ్‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే ఫాంటసీ డ్రామా ఇది. ప్రేమ, త్యాగం, మోసం, ద్రోహం, దోపిడీ లాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉండనున్నాయట.

 సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ నటించనున్నారు. నిజానికి మొదట దీన్ని సినిమాగా తీయాలనుకున్నారు. కానీ పెద్ద కథ కావడంతో ఒకే భాగంలో పూర్తి కథ చెప్పలేమని వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌గా మార్చారని టాక్. నెట్‌‌‌‌ ఫ్లిక్స్‌‌‌‌ కోసం హై టెక్నికల్ వ్యాల్యూస్, వీఎఫ్‌‌‌‌ఎక్స్ వర్క్‌‌‌‌తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్‌‌‌‌ కానుంది.