రోడ్డు భద్రత విషయంలో అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన సడక్ సురక్ష అభియాన్ మూడవ ఎడిషన్ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు విక్రాంత్ మాస్సేతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. అలాగే మహిళల డ్రైవింగ్ గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సమంత ను రోడ్డు భద్రత అలాగే ప్రయాణిస్తున్నప్పుడు అవగాహన గురించి ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అడిగారు. దీంతో సమంత ఈ విషయంపై స్పందిస్తూ “ఇదంతా స్వీయ-ఆలోచనతో ప్రారంభమవుతుందని నేను అనుకుంటున్నాను. రూల్స్ పాటించకుండా పట్టుబడకుండా ఉండటానికి ఎప్ప్పుడూ భయపడతుంటాం. కానీ ‘మీరు మీ కోసం, మీ కుటుంబానికి సరైన పని చేస్తున్నారా?’ అనే స్వీయ-ఆలోచన ఉండాలని అనుకుంటున్నట్లు భావిస్తున్నానని తెలిపింది.
అలాగే మహిళల డ్రైవింగ్ గురించి మాట్లాడుతూ మహిళలు డ్రైవింగ్ చేసే సమయంలో పడుతారని దీంతో పలు ప్రమాదాలు జరుగుతాయని అడిగినప్పుడు సమంత మొదట్లో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే మహిళలు మల్టీ టాస్కింగ్‌లో గొప్పవారని, అది వారిని మెరుగైన డ్రైవర్లుగా మారుస్తుందని చెప్పుకొచ్చింది. ఇక మహిళల డ్రైవింగ్ వల్లే అధిక ప్రమాదాలు జరుగుతాయని తాను నమ్మడం లేదని అలాగే ఈ విషయానికి సంబంధించి రుజువులు కూడా లేవని తెలిపింది.