Samantha: ఆడవాళ్ల సీరియల్ పిచ్చిపై సమంత మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Samantha: ఆడవాళ్ల సీరియల్ పిచ్చిపై సమంత మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

హీరోయిన్‌‌ సమంత నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌‌ ప్రారంభించిన ఆమె.. ఫస్ట్ మూవీగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీనికి దర్శకుడు. వసంత్ మరిగంటి కథను అందించాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌‌ వర్క్స్ జరుగుతున్నాయి. శుక్రవారం సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘మీకు శుభం కలుగుగాక.. మే 9న కలుద్దాం’అంటూ సమంత సోషల్ మీడియా ద్వారా రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేసింది.

ఆడవాళ్ల సీరియల్ పిచ్చి నేపథ్యంలో సినిమా ఉండబోతోందని టీజర్‌‌‌‌లో చూపించారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సెన్సిబుల్, హ్యూమర్‌‌ ఉన్న సినిమా ఇదని మేకర్స్ చెప్పారు.