CitadelHoneyBunny: సిటాడెల్: హనీ బన్నీ రివ్యూ.. సమంత, వరుణ్ ధావన్‌ల వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సిటాడెల్: హనీ బన్నీ (Citadel Honey Bunny) వెబ్ సీరీస్ ఇవాళ గురువారం (నవంబర్ 7న) అమెజాన్  ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్ వెబ్ సీరీస్ను రాజ్ & డికె (రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె) తెరకెక్కించారు.

ఇందులో సమంత మరియు వరుణ్ ధావన్ స్పై ఏజెంట్స్ హనీ బన్నీ పాత్రల్లో నటించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత సమంత చేసిన వెబ్ సిరీస్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం ఆరు ఎపిసోడ్లుగా రిలీజైన ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే::

సినిమాల్లో యాక్టర్ అవ్వాలనుకుంటుంది హనీ (సమంత రూత్ ప్రభు). ఇక బన్నీ (వరుణ్ ధావన్) సినిమాల్లో స్టంట్ మ్యాన్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరూ సినిమా సెట్స్‌లో లవ్‌లో పడతారు. అయితే.. బన్నీ స్టంట్ మాస్టర్‌గానే కాకుండా బాబా అలియాస్ గురు (కేకే మీనన్) స్థాపించిన ప్రైవేట్ సంస్థలో నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన హనీ జాబ్ కోసం బన్నీ చేస్తున్న సంస్థలోనే ఏజెంట్‌గా చేరుతుంది. ఈ క్రమంలో హనీ, తన కూతురు నదియాని (కశ్వి మజ్‌ముందర్) చిన్నప్పటి నుంచి ఎంతోస్ట్రాంగ్గా పెంచుతోంది. కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ట్రైనింగ్ ఇస్తోంది. ఆమెకు 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేలా నేర్పుతోంది. అలాగే కశ్వి కరాటేలో బ్లాక్ బెల్ట్.. ఆమె పాత్ర ఈ వెబ్ సిరీస్‌కి స్ట్రాంగ్ పిల్లర్గా నిలుస్తోంది. అయితే, అనుకోకుండా అండర్ వరల్డ్‌ గ్యాంగ్ నదియాపై అటాక్ చేస్తారు.

ఇక ఈ హానీ బన్నీ తమ ప్రేమతో ఒక్కటయ్యాక ఈ ఇద్దరూ నదియాని కాపాడేందుకు అండర్ వరల్డ్‌తో పోరాటం చేస్తారు. అయితే, నదియాకు వచ్చిన కష్టం ఏంటీ? నదియాను కాపాడటం కోసం వీళ్ళు ఎలాంటి పోరాటం చేశారు? ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు అండర్ వరల్డ్‌తో ప్రమాదం తెచ్చుకోవడానికి గల.. వారి వెనుకున్న గతం ఏంటి? అనేదే సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ స్టోరీ. 

విశ్లేషణ & నటీనటుల పెర్ఫార్మన్స్:: 

అయితే ఎప్పుడూ కూల్ హీరోయిన్గా గ్లామర్ పాత్రల్లో కనిపించిన సమంత.. ఈసారి సిటాడెల్లో డిఫరెంట్ రోల్లో యాక్షన్ క్వీన్గా కనిపించింది. యాక్షన్, ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్.. ఇలా ప్రతి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సమంత అదరగొట్టేసింది. ఈ క్రమంలో రోజుకో కొత్త సమస్య వస్తోందని కానీ ఈ సమస్యలని ఎదుర్కోవడం పెద్ద సమస్యని వరుణ్ ధావన్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

ఇక యాక్టర్ అవ్వాలనుకున్న సమంత స్పై ఏజెంట్ ఎలా అయిందనే విషయాలు సీరీస్పై ఆసక్తిని పెంచాయి.వరుణ్ ధావన్‌తో కశ్వికి మధ్య పెద్దగా సీన్లు లేవు. లాస్ట్ 6వ ఎపిసోడ్లలోనే ఈ ఇద్దరి మధ్య సీన్లు ఉన్నాయి. సమంత, వరుణ్ ధావన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. మొత్తానికి ఒక సర్వైవల్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అనే విషయం అయితే అర్థమవుతోంది. ఇకపోతే ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంతతో పాటు సిటాడెల్‌లో నటించిన సికందర్ ఖేర్, కెకె మీనన్ మరియు షకీబ్ సలీమ్ కూడా తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు. 

కేవలం గ్లామర్ పాత్రల్లో మాత్రమే కాకుండా వెబ్ సీరీస్లలో కూడా నటించేందుకు సామ్ ఒకే చెబుతుండడం విశేషం. ఇక టీజర్, ట్రైలర్ రేలి చేసిన దగ్గరనుండి ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఉందంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

అమెరికన్ సిరీస్ సిటాడెల్‍కు ఇండియన్ వెర్షన్‍గా 'సిటాడెల్: హనీ బన్నీ' రూపొందింది. అమెరికన్ వెర్షన్‍లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర చేశారు. ఈ స్పై థ్రిల్లర్ వెబ్ సీరీస్ను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన డి2ఆర్ ఫిల్మ్స్ మరియు అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ కలసి సంయుక్తంగా నిర్మించాయి.