హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సామ్.. గత కొన్ని రోజులుగా పెద్దగా పోస్టులు పెట్టడం లేదు. అయితే గురువారం నుంచి మళ్లీ ఆమె యాక్టివ్‌గా తన భావాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. రీసెంట్‌గా మహిళా సాధికారికత గురించి సామ్ చేసిన పోస్టు అందర్నీ ఆలోచింపచేస్తోంది. మగాళ్లను ప్రశ్నించే సత్తా లేదా అని సామ్ క్వశ్చన్ చేసింది.
చైతో బంధాన్ని తెంచుకున్న నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు, కామెంట్లకు దీటుగా సామ్ సమాధానం ఇచ్చినట్లుగా ఉందీ పోస్టు. అందులో ఏముందంటే.. ‘మహిళలు ఏదైనా చేస్తే ప్రశ్నిస్తారు. ఎల్లప్పుడూ స్త్రీలను విలువల గురించి ప్రశ్నించే ఈ సమాజం.. మగవాళ్లు ఏం చేసినా ప్రశ్నించదు. అలాంటప్పుడు సమాజంలో ఉంటున్న మనకు అసలు నైతికత అనేదే లేనట్లు కదా?’ అని ఫరీదా అనే రచయిత్రి కోట్‌ను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.