Samantha: బర్త్ డే స్పెషల్.. సమంత ఆస్తి ఎన్ని కోట్లు? ఒక్కో సినిమాకు ఎంత ఛార్జ్ చేస్తుంది?

Samantha: బర్త్ డే స్పెషల్.. సమంత ఆస్తి ఎన్ని కోట్లు? ఒక్కో సినిమాకు ఎంత ఛార్జ్ చేస్తుంది?

హీరోయిన్ సమంత.. ఈ పేరుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన వర్సటైల్ యాక్టింగ్ తో  లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేసింది. సమంత 1987 ఏప్రిల్ 28న తమిళనాడులో జన్మించింది. నేడు (ఏప్రిల్ 28) ఈ బ్యూటీ తన 39వ పుట్టినరోజును జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా సమంతకు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, ఆమె ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో సమంత హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో ట్రేండింగ్ అవుతుంది. మరి సామ్ సినీ ఎంట్రీ, ప్రస్తుతం తను నటించబోయే కొత్త సినిమాల గురించి ఓ లుక్కేద్దాం.

సమంత సినీ ప్రస్థానం:

2010లో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో సమంత తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, ఈగ, రంగస్థలం వంటి పలు సినిమాలలో నటించి అతితక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది.

ఆపై సమంత పలు భాషల సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియన్ స్టార్ స్టేటస్ పొందింది. దానికోతోడు తన విలక్షణ నటనకు అవార్డులు కూడా రావడం తనకెంతో గుర్తింపు వచ్చేలా చేసింది. అటు తెలుగు, ఇటు తమిళంలోనూ 'దక్షిణ భారత ఫిలింఫేర్' ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా ప్రసిద్ధి గాంచింది.

సమంత హిందీ పరిశ్రమలో 2012 లో వచ్చిన ఏక్ దీవానా థా మూవీలో ఒక చిన్న అతిధి పాత్ర పోషించింది. ఆ తర్వాత, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్-సిరీస్ 2లో రాజీ పాత్రతో నార్త్లో బిజీయెస్ట్ హీరోయిన్గా మారింది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సమంత బిజినెస్:

అయితే, ప్రస్తుతం సామ్ నటిగా, నిర్మాతగానే కాకుండా బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ బిజీగా మారింది. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సంవత్సరానికి రూ.8 కోట్లు సంపాదిస్తుందని సమాచారం.

►ALSO READ | May OTT Movies: మేలో ఓటీటీకి రానున్న టాప్ 4 తెలుగు కొత్త సినిమాలివే.. ఎక్కడ చూడాలంటే?

ఒక్కో సినిమాకు రూ.3.5 నుంచి 5 కోట్లు తీసుకుంటుందని టాక్. వెబ్ సిరీస్ కోసం అయితే 10 కోట్ల వరకూ తీసుకుంటుందట. ఇక సమంత ఆస్తి మొత్తం నికర విలువ సుమారు రూ.101 కోట్లు అని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత దగ్గర BMW 7-సిరీస్, జాగ్వార్ XF, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ G63 AMG కార్లు ఉన్నాయి. 

సమంత రాబోయే సినిమాలు:

సిటాడెల్: హనీ బన్నీ తర్వాత, సమంత రూత్ ప్రభు ఈ యాక్షన్-ఫాంటసీ సిరీస్ కోసం దర్శక ద్వయం రాజ్ మరియు డికెలతో మళ్ళీ చేతులు కలిపింది. రక్త్ బ్రహ్మండ్ లో నటిస్తోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి మరియు అలీ ఫజల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమంత తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' లో మా ఇంటి బంగారం మూవీ చేస్తుంది. అలాగే, శుభం అనే మూవీ నిర్మించింది. ఈ మూవీ మే 9న రిలీజ్ కానుంది. 

సమంత వ్యక్తిగత జీవితం:

ఇకపోతే, సమంత రూత్ ప్రభు అక్టోబర్ 2017లో హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఈ జంట గోవాలో హిందూ మరియు క్రైస్తవ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. వారు 2021లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.