Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత విన్నపం..అలా చేయాలంటూ సలహా..వణికిపోతున్న టాలీవుడ్!

Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత విన్నపం..అలా చేయాలంటూ సలహా..వణికిపోతున్న టాలీవుడ్!

మలయాళ ఇండస్ట్రీలో రిటైర్డ్ జడ్జి హేమ కమిటీ (Hema Committee Report) రూపొందించిన నివేదక ప్రకంపనలు సృష్టిస్తోంది. హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు విస్తుపోయే నిజాలు (విషయాలు) మలయాళ పరిశ్రమలో వెలుగుచూశాయి. మలయాళ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది.

ఇదిలా ఉండగా జస్టిస్ హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి సమంత (Samantha Ruth Prabhu) స్పందించింది. జస్టిస్ హేమ కమిటీ నివేదికను ఆమె స్వాగతీస్తూ టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్నీ కోరింది. ఈ నేపథ్యంలో సమంత శుక్రవారం (ఆగస్ట్ 30) తన చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో చూడండి.

"తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మా మహిళలంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. కేరళలో వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ల కృషే ఈ ఉద్యమానికి దారి తీసింది. ఆ డబ్ల్యూసీసీ నుంచి స్ఫూర్తి పొందే.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం ఏర్పడిన సపోర్ట్ 'గ్రూపు ది వాయిస్ ఆఫ్ వుమెన్' 2019లో ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుంది" అనే వాయిస్ ఆఫ్ వుమెన్ ప్రకటనను సమంత స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు హేమ కమిటీ ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ అధ్యక్ష పదవికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రాజీనామా చేశాడు.

Also Read :- ఎన్టీఆర్, అల్లు అర్జున్​ ప్రశంసలు మర్చిపోలేను

అంతేకాకుండా..హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత నటీమణులు రేవతి సంపత్, మిను మునీర్ వంటి యాక్ట్రెస్ తమను సెక్సువల్ అబ్యూస్‌కు గురి చేశారంటూ కొంత మంది నటుల పేర్లు వెల్లడించారు. ఇలా ఇపుడు ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తున్నారు. దీంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ దర్శకుడు రంజిత్‌, నటులు సిద్ధిఖీ, బాబురాజ్‌, జయసూర్య, ముకేశ్‌,  సూరజ్‌ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు వారిపై కేసులు కూడా నమోదయ్యాయి.