సినీ నటి సమంత జీవితంలో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయారు. గుండె పగిలిన ఎమోజీతో ఈ విషాదాన్ని ఇన్స్టాగ్రాంలో సమంత తన అభిమానులకు తెలిపింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఒక ఆంగ్లో ఇండియన్. సమంత తన జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న సమయంలో ఆమెకు ఒక కన్నతండ్రిగా అండగా నిలిచారు. తండ్రి చనిపోవటంపై సమంత ఎమోషనల్ అయింది. తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా విషయం చెప్పింది. అప్పుడే ఈ ప్రపంచానికి తెలిసింది. సమంత ఇంట్లో విషాదంపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు. ‘మళ్లీ జన్మలో మళ్లీ కలుద్దాం నాన్న’ అనే అర్థం వచ్చేలా సమంత ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. హార్ట్ బ్రోకెన్ సింబల్ పోస్ట్ చేసి సమంత.. తన తండ్రి మరణవార్తను చెప్పింది.
2021 అక్టోబర్ నెలలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. దాదాపు సంవత్సరం తర్వాత ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు ఆయన తన ఫేస్ బుక్లో సమంత, నాగచైతన్య పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. తన కూతురు విడాకులు తీసుకుందనే విషయాన్ని అంగీకరించడానికి చాలా సమయం పట్టిందని, ఆమె తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన పోస్ట్ చేశారు. సమంత తన తండ్రితో ఉన్న అనుబంధంపై ఒక ఇంటర్వ్యూలో ఇటీవల చెప్పుకొచ్చింది. తన తండ్రి కూడా ఇండియాలోని చాలా మంది పేరెంట్స్ లాంటి ఫాదరేనని సామ్ చెప్పింది. మనల్ని కాపాడుకుంటున్నామని వాళ్లు భావిస్తారని తెలిపింది.
ALSO READ | Amaran OTT: అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చదువు విషయంలో కూడా తన తండ్రి చేసిన వ్యాఖ్యలను సమంత ప్రస్తావించింది. నువ్వు అంత తెలివైన అమ్మాయివేం కాదు. ఇండియాలో ఎడ్యుకేషన్ స్టాండర్ట్స్ ఇంతే. అందువల్లే.. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది’ అని సమంతతో ఆమె తండ్రి చెప్పారట. చిన్న వయసులో తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు చెప్తే.. ఎప్పటికీ గుర్తుండిపోతాయని, అప్పటి నుంచి తాను అంత స్మార్ట్ కాదేమో అనే ఆత్మ న్యూనత భావం తనను వెంటాడేదని సమంత ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. సమంత మాట్లాడిన ఈ వ్యాఖ్యలను గమనిస్తే ఆమె తండ్రితో బాల్యం నుంచి ఆమెకు పెద్దగా ఎఫెక్షన్ లేదని స్పష్టమవుతుంది.