టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ప్రస్తుతం చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు సమాచారం. తాజాగా సామ్ తాను చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్నట్లు తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఇందులో సమంత ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పులు నుంచి కోలుకోవడం అనేది చాలా సరదాగా ఉంటుంది’ అని సాడ్ ఎమోజీ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో సమంత త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే 2022 లో మాయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్నట్లు సమంత వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ తీసుకొని మరీ ఈ వ్యాధికి చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం సమంత తనకు తాను స్ట్రాంగ్ ఉండటం కోసం నిత్యం జిమ్ములో కసరత్తులు చేస్తూ హెల్త్ పై శ్రద్ధ పెట్టింది.
ఇటీవలే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ‘సిటడెల్: హనీ బన్నీ’లో నటించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోవేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చి దూసుకెళ్తోంది.
"Recovering from Chikungunya is so fun 😌 😌 😌 The joint pains and ALL"
— Samcults (@Samcults) January 10, 2025
~Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#CitadelHoneyBunny #RaktBramhand#MaaIntiBangaram pic.twitter.com/m94S1yMV8R