యూటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన టాలెంట్ ఏంటో చూపించిన సమంత.. మొదటిసారి ఓ పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలమ్’లో శకుంతల పాత్ర పోషిస్తోంది. నిన్న ఆమె ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. అది చూస్తే ఈ ప్రేమకథని ఓ దృశ్యకావ్యంలా మలుస్తున్నానని గుణశేఖర్ చెప్పిన మాట ముమ్మాటికీ నిజమేననిపిస్తోంది. పచ్చని వనంలో ఓ రాయిమీద కూర్చున్న సమంత.. తెల్లని దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరుస్తోంది. ఎర్రని పూలనే ఆభరణాలుగా మార్చి చేసిన అలంకరణ ఆమెకి మరింత అందాన్ని తెచ్చింది. చుట్టూ జింకలు, నెమళ్లు, కుందేళ్లు, హంసలు, సీతాకోక చిలుకలు, రకరకాల పక్షులు ఉన్నాయి. అవన్నీ ఎవరీ సౌందర్యరాశి అన్నట్టుగా తలెత్తి ఆమెవైపే చూస్తున్నాయి. కానీ సమంత మాత్రం వీటిలో దేనినీ చూడటం లేదు. ఆమె కళ్లు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. దుష్యంతుడి కోసమే అనుకుంటా.. దారి కాచుకుని ఉన్నాయి. మొత్తంగా ఈ దృశ్యం.. ఒక అందమైన పెయింటింగ్లా ఉంది. చూడగానే వావ్ అనిపిస్తోంది. దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషిస్తున్నాడు. వారి కొడుకు భరతుడిగా అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ నటిస్తోంది. దిల్ రాజు సమర్పణలో నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
శకుంతల పాత్రలో సమంత
- టాకీస్
- February 22, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- రన్నింగ్ కారులో మంటలు
- వేములవాడ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి
- ఆదివాసీ సొసైటీలతోనే ఇసుక వ్యాపారం
- మూసీ ప్రక్షాళన చేయాల్సిందే..బాధితులకు ప్రత్యామ్నాయం చూపించి ముందుకెళ్లాలి
- లగచర్ల ఘటనపై .. కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా
- భూసేకరణకు ఎవరొచ్చినా తరిమికొడదాం : పట్నం నరేందర్రెడ్డి
- మద్దతు ధరతోపాటే బోనస్
- ప్రభుత్వాన్నికూల్చేందుకు బీఆర్ఎస్ కుట్ర : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- నాంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం
- గ్రూప్ 4 ఫలితాలు విడుదల .. 8,084 మందితో సెలెక్షన్ లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సీ
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!