SamanthaRuthPrabhu: సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. స్టన్నింగ్ గా కొత్త లుక్

SamanthaRuthPrabhu: సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. స్టన్నింగ్ గా కొత్త లుక్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొత్త లుక్లో దర్శనమిచ్చింది. లేటెస్ట్గా సామ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొత్త ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్లో సామ్ హాలీవుడ్ మోడల్లో మేకోవర్ అయింది. ఎప్పటికప్పుడు తన కొత్త లుక్స్తో కుర్రాళ్లను కుదిపేస్తోన్న సామ్.. ఈ లేటెస్ట్ లుక్తో మత్తెక్కేలా చేస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ లుక్కి కొంతమంది నెటిజన్స్ ఫిదా అయినప్పటికీ..మరి కొంతమంది పాత సామ్ కావాలంటున్నారు. 'ఏ మాయ చేసావే జెస్సీగా'.. చూడాలని సామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు సామ్ అల్లరి ఎక్కడ? ఆ ఆకాయితనం ఎక్కడ అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

అయితే, సమంత ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఈ కొత్త ఫోజులిచ్చింది. అంతేకాకుండా త్వరలో ఓ హాలీవుడ్ మూవీలో సామ్‌ నటిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 

ALSO READ | Sonu Nigam: వెన్నునొప్పితోనే రాష్ట్రపతి భవన్‌లో పాట.. సోను నిగమ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్

ఇటీవలే రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో సామ్‌ నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌' లో అదరగొట్టింది. ఈ సిరీస్‌లో యాక్షన్ సీన్స్‌తో అదరగొడుతూనే మదర్ క్యారెక్టర్లో ఎమోషనల్కు గురిచేసింది. దాంతో పాటు రొమాంటిక్ సీన్స్ లోను యూత్ని ఆకట్టుకుంది.

ఇక టాలీవుడ్ సమంత ఫ్యాన్స్ ఆశలు నెరవేరబోయే రోజు దగ్గర్లోనే ఉంది. గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌‌’ (Tralala Moving Pictures)పేరుతో బ్యానర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన సమంత, ఈ సంస్థలో నిర్మించబోయే మొదటి మూవీ ‘మా ఇంటి బంగారం’. త్వరలో ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంతనే లీడ్‌‌‌‌ రోల్ చేస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GQ India (@gqindia)