Samantha: ‘X’ లోకి సమంత రీ ఎంట్రీ.. మొదటి పోస్ట్ షేర్.. ట్రెండ్ క్రియేట్ అయ్యేలా ఫాలోవర్లు

Samantha: ‘X’  లోకి సమంత రీ ఎంట్రీ.. మొదటి పోస్ట్ షేర్.. ట్రెండ్ క్రియేట్ అయ్యేలా ఫాలోవర్లు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత X (గతంలో ట్విట్టర్)కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సామ్.. తాజాగా X లోకి అడుగుపెట్టింది.

సమంత 2023 లో నిర్మాతగా మారి సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది. ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ అంటూ కొత్త టాలెంట్స్ను పరిచయం చేసేందుకు సిద్దపడింది. ఇందులో భాగంగా ట్రాలాల ప్రొడక్షన్ హౌస్ నుంచి నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ ‘శుభం’ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు నేడు సోమవారం( ఏప్రిల్ 7న) X లో పోస్ట్ పెట్టింది. 

‘పెద్ద కలలతో.. మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం. గొప్ప ప్రారంభం’ అని X లో రాసుకొచ్చింది. సామ్ రీఎంట్రీపై నెటిజన్లు ఖుషి అవుతున్నారు. ‘వెల్‌కమ్‌ బ్యాక్‌ సామ్‌’, ‘క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Also Read : హీరో రవితేజ కూతురిని చూశారా

ప్రస్తుతం (పోస్ట్ పెట్టిన 6 గంటల్లోపే) ఈమెను ఎక్స్‌లో 10.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇంస్టాగ్రామ్లో 37.2మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించుకుంది. అయితే, సమంత తన X ప్రొఫైల్‌లో చేసిన మొదటి పోస్ట్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. త్వరలో X లో మరింత మంది ఫాలోవర్లతో ముందుంజలో ఉండనుంది సామ్‌. ఇకపోతే సమంతకు యూట్యూబ్ లో 890K సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. 

ఇకపోతే.. శుభం సినిమా విషయానికి వస్తే.. సినిమాబండి మూవీతో పేరుగాంచిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వచించాడు. ఈ మూవీలో కల్కి 2898 AD ఫేమ్ హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి మరియు వంశీధర్ గౌడ్‌లతో సహా మరికొంత మంది కొత్త నటులు నటిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

ఇకపోతే.. ఖుషీ సినిమా తరువాత మరో కొత్త సినిమాను ప్రకటించలేదు సమంత. నిజానికి ఆమె సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌‌’ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కుతోంది. ఇందులో సమంతనే లీడ్‌‌‌‌ రోల్ చేస్తోంది.