Samantha: హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..'వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కైవసం

Samantha: హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..'వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కైవసం

సెప్టెంబర్ 27 శుక్రవారం జరిగిన IIFA ఉత్సవం 2024 గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు సినీ తారలు. ఈ నేపథ్యంలో నటీమణులు ప్రతిష్టాత్మకంగా  భావించే 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' (Woman of the Year in Indian Cinema) అవార్డును స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ మరియు బాలీవుడ్ సినిమాల స్టార్స్ విచ్చేసి సమంతకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ 'ఐఫా' అవార్డుల వేడుక అబుదాబి (Abu Dhabi) వేదికగా ఘనంగా జరుగుతోంది. 

తాజాగా IIFA ఉత్సవం యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ నుంచి సామ్ అవార్డు అందుకున్న వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో సమంత తన అవార్డును బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నుండి అందుకున్నప్పుడు.. కేరింతలతో అభిమానులు ఉత్సహాన్ని చూడొచ్చు.

అయితే, సమంత ఈ  అవార్డును అందుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే.."సినీ పరిశ్రమలో సమంత సాధిస్తోన్న విజయాలు ఒకటైతే.. తనపై అభిమానులు చూపిస్తోన్న అపారమైన ఆదరణ మరో విషయం". ప్రస్తుతం సామ్ IIFA ఉత్సవంకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

కాగా..ఈ వేడుక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా’ (Outstanding Achievement in Indian Cinema) అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం లిరిక్ రైట‌ర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు.

మ‌రోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన ‘జైల‌ర్’ సినిమాకు అవార్డు ద‌క్కగా.. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో ‘ద‌స‌రా’ సినిమాకు నాని అవార్డు దక్కించుకున్నారు. అలాగే గోల్డెన్‌ లెగసీ అవార్డును కరణ్‌జోహర్‌ చేతుల మీదుగా బాలకృష్ణ అందుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IIFA Utsavam (@iifautsavam)