టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha) ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి హాలిడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తోంది. సామ్ మయోసైటిస్ ట్రేట్ మెంట్ కోసం విరామం ప్రకటించాక వరుస ట్రిప్స్తో బిజీగా ఉంది . అలాగే తన హెల్త్ స్టేటస్ను అభివృద్ధి చేసుకోవడానికి..మనసు ప్రశాంతతో ఉండటానికి ప్రపంచంలోని అందమైన ప్రదేశాలన్నీ చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది.
ప్రస్తుతం సామ్ ఆస్ట్రియా(Austria) దేశానికి వెళ్ళి..అక్కడి అందమైన ప్రదేశాలను ఆస్వాదిస్తూ హ్యాపీ లైఫ్ ను గడుపుతుంది. అందుకు సంబంధించిన ఫొటోస్ ను, వీడియోస్ ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో తన హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటోంది. అందులో భాగంగా ఆస్ట్రియాలో సైకిల్ తొక్కుతూ షికార్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- ALSO READ| జాన్వీ హైదరాబాద్లోనే మకాం..ఎందుకో తెలుసా?
ఆస్ట్రియాలోని సెల్జ్ బర్గ్ అనే నగరాన్ని సందర్శించి..ఓ సరస్సు పక్కన రోడ్డుపై సైకిల్ తొక్కుతూ నేచర్ని ఆస్వాదిస్తుంది. అలాగే కాసేపు సరస్సు పక్కనే కూర్చొని..ప్రకృతిలో సేద తీరిన ఫొటోస్ను కూడా షేర్ చేసింది. వీటితో పాటు ఓ బాడీ పెయింటింగ్ కార్యక్రమానికి వెళ్లిన సామ్.. అక్కడ దిగిన పిక్స్ను షేర్ చేయడంతో..సూపర్ సామ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సమంత మూవీస్ విషయానికొస్తే...ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సీటాడెల్ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ వెబ్ సీరిస్ ని ఓటీటీ అమెజాన్ ప్రైమ్ నిర్మించింది. ఇక తన సినిమాల బ్రేక్ కంప్లీట్ అయిన తర్వాత బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబోపై క్లారిటీ రానుంది.