స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో 'ప్రేమ ఒక త్యాగం' అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. స్నేహం, ప్రేమ రిలేషన్‌షిప్‌లో ఇచ్చిపుచ్చుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలా జీవితంలో ప్రతీ రిలేషన్ ఇచ్చి పుచ్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వివరాల్లోకి వెళితే..
“చాలా మంది వ్యక్తులు, స్నేహాలు, రిలేషన్ షిప్స్ పరస్పరం చూస్తుంటారు. అందుకు నేను అంగీకరిస్తున్నాను.. మీరు ఇవ్వండి.. నేను ఇస్తాను. కానీ కొన్నిసార్లు ప్రేమను అవతలి వ్యక్తి ఇచ్చే స్థితిలో లేనప్పుడు మీరు కూడా ఇవ్వగలరని నేను కొన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నాను. ఇది మీరు ఇవ్వడం అనేది ఎదుటివ్యక్తి నుంచి వస్తుంది..అలాగే నేను ఇస్తాను..మీరు తిరిగి ఇచ్చే వరకు నేను ఇస్తాను..కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయింది..ప్రేమంటే ఒక త్యాగం. ఒక సీజన్ కోసం బ్యాలెన్స్ చిట్కాలు కూడా ఉన్నాయి. తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా ప్రేమను ఇస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం సామ్ చేసిన ఈ స్టోరీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. మరి ఈ పోస్ట్ అంతరార్థం ఏమై ఉంటుందో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. సమంత ఎంత ప్రేమించిన నాగచైతన్య నుంచి అంత ప్రేమ దక్కలేదా? అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఏమైనా సమంత వరుసగా ఘాటైన పోస్టులు పెట్టి టాక్ ఆప్ ది టౌన్‌గా మారారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే సమంత ఒక కార్యక్రమంలో బ్లాక్ డ్రెస్సులో కనిపించిన ఫోటో ఒకటి ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేసింది. సమంత ముఖంలో మునపటి ఆకర్షణలేదంటూ, చాలా సన్నగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఓ అడుగు ముందుకేసి నాగచైతన్య, శోభితా నిశ్చితార్థం కారణంగానే సమంత బెంగ పెట్టుకుంందని..అందుకే ఇలా అయ్యిందంటూ ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు.