ధ్యానం చేస్తున్న సామ్.. ఫొటోస్ వైరల్

ప్రముఖ నటి సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయాన (జూలై 20) కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో ధ్యానం చేస్తూ ప్రత్యక్షమయ్యారు. సమంత అక్కడ కలిగిన ఫీలింగ్ ను సోషల్ మీడియా లో పంచుకుంటూ.. ఫొటోస్ ను షేర్ చేశారు. 

“కొంతకాలం క్రితం, ఆలోచనలు లేకుండా కూర్చోవడం, కుదుటపడకుండా, దురదగా, మెలితిప్పినట్ల, తల తిరగడం దాదాపు అసాధ్యం అనిపించింది.. కానీ నేడు, ధ్యాన స్థితి నా శక్తికి అత్యంత శక్తివంతమైన మూలం. ఎంతో ప్రశాంతతను ఇచ్చే ఈ మార్గంలో ఏదో తెలియని గొప్ప అనుభూతి ఉందంటూ.. చాలా శక్తివంతమైన మార్గం ఇదని ఇప్పుడే అర్థమైంది" అని పేర్కొన్నారు. 

సమంత రీసెంట్ గా  'సిటాడెల్' సెట్స్‌కి వీడ్కోలు ఇవ్వగా.. ఖుషి మూవీ సైతం షూట్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత ఖుషి మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికే అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ మూవీలో వీరి నటనకు ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతారని టీం ప్రకటించిన విషయం తెలిసేందే. 

2023 సెప్టెంబర్ 1న ఖుషి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గత కొంత కాలంగా మయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత..కొంతకాలం పాటు సినిమాలకు విరామం తీసుకోనుంది.