Samantha: అతనితో నా బంధం ప్రత్యేకం.. ఏ పేరు పెట్టలేను.. సమంత ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు

Samantha: అతనితో నా బంధం ప్రత్యేకం.. ఏ పేరు పెట్టలేను.. సమంత ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు

సినీ హీరోయిన్ సమంత లేటెస్ట్గా కోలీవుడ్లో నిర్వ‌హించిన ఓ కార్య క్రమంలో 'గోల్డెన్ క్వీన్' పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

'మయోసైటిస్ వ‌ల్ల నాకు హెల్త్ బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ అండగా నిలిచాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు. మా బంధానికి పేరు పెట్టలేను.

స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు రక్తసంబందీకుడా అని చెప్పలేను. ఫ్యాన్స్ మద్దతు నా అదృష్టం. లక్ పాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది. అభిమానానికి కారణం. దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్ చేస్తే అది అబద్దమే అవుతుంది. తెలిసి, తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్ పై ప్రభావం చూపుతాయి' అని సమంత తెలిపింది. ఇదే ఈవెంట్ లో డైరెక్టర్ సుధా కొంగర పాల్గొని సమంతపై ప్రశంసంలు కురిపించింది. తనకు వీరాభిమానిని, ఎప్పటికైనా తనతో ఓ సినిమా చేస్తానని సుధా చెప్పుకొచ్చింది. 

ఇక సినిమాల విషయాలకొస్తే.. సమంత ప్రస్తుతం ''రక్త బ్రహ్మాండ్'' కోసం వర్క్ చేస్తోంది. యాక్షన్ ఎంటర్టై నర్ గా ఇది సిద్ధం అవుతోంది. అలాగే ఆమె నిర్మాతగా వ్యవహరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ 'శుభం' మే 9న రిలీజ్ కానుంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ అనే మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.