SamanthaRuthPrabhu: సమంత కొత్త లుక్కి నెటిజన్లు ఫిదా.. ఏకంగా 9.24కి పైగా లైక్స్తో వైరల్

SamanthaRuthPrabhu: సమంత కొత్త లుక్కి నెటిజన్లు ఫిదా.. ఏకంగా 9.24కి పైగా లైక్స్తో వైరల్

'ఏ మాయ చేసావే" నుండి 'యశోద' వరకు సమంత (Samantha) ఏ పాత్ర పోషించినా తనదైన ముద్ర వేసుకోవడం మామూలే. సామాన్య పాత్రల నుంచి బోల్డ్ రోల్స్ వరకు ఆమె చేసే క్యారెక్టర్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం సామ్ తన ఆరోగ్యం, ఫిట్ నెస్ పైన ఫోకస్ పెడుతూ, వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. సమంత లేటెస్ట్ గా ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటో నెటిజెన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా 9,24 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. సాధారణ డ్రెస్లో కూడా సమంతకు ఉన్న స్టైల్ గ్లామర్ కి నిదర్శనంగా ఈ లేటెస్ట్ లుక్ నిలుస్తోంది.

ప్రస్తుతం సామ్ తెలుగు, బాలీవుడ్ సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌‌’ (Tralala Moving Pictures)పేరుతో బ్యానర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన సమంత, ఈ సంస్థలో నిర్మించబోయే మొదటి మూవీ ‘మా ఇంటి బంగారం’.

Also Read :- దర్శకుడిగా అనిల్ రావిపూడి 10 ఏళ్లు కంప్లీట్

ఇటీవలే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంతనే లీడ్‌‌‌‌ రోల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో సమంత లుక్ చాలా కొత్తగా ఉంది. మేడలో తాలిబొట్టు, చేతిలో గన్, మొహానికి రక్తంతో, వంటగదిలో ఉన్న సామ్ లుక్ సరికొత్తగా ఆకట్టుకుంది. ఇక ఇదే బ్యానర్ లో హీరో ప్రియదర్శితో సామ్ ఓ మూవీ చేసే అవకాశం ఉంది.