
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సమంత.. ఏడాదిన్నరగా తెలుగు తెరపై కనిపించలేదు. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లో నటించిన ఆమె నుంచి.. ఇప్పటివరకు తెలుగులో ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో సమంత చేయబోయే నెక్స్ట్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా తన కెరీర్ విషయంలో ఓ క్రేజీ అప్‌డేట్ వినబడుతోంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘పరదా’ చిత్రంలో సమంత అతిథి పాత్రలో మెరవనుందట.
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషిస్తుండగా, గెస్ట్ రోల్‌లో సమంత కనిపించనుందని, ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. మిస్టరీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో సమంత క్యారెక్టర్ క్లైమాక్స్‌లో రానుందని సమాచారం. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. అనుపమ, సమంత కలిసి గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అఆ’ చిత్రంలో నటించగా, ఇప్పుడు అనుకోని అతిథిగా సమంత కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.