హీరోయిన్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన సౌత్ బ్యూటీ సమంత(Samantha).. మరో అడుగు ముందుకేసి నిర్మాతగా మారింది. గత ఏడాది డిసెంబర్‌లోనే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures)పేరుతో బ్యానర్ ప్రారంభించిన ఆమె, ఈ సంస్థలో నిర్మించబోయే మొదటి మూవీ ‘మా ఇంటి బంగారం’.
ఇటీవలే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంతనే లీడ్ రోల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో సమంత లుక్ చాలా కొత్తగా ఉంది. మేడలో తాలిబొట్టు, చేతిలో గన్, మొహానికి రక్తంతో, వంటగదిలో ఉన్న సామ్ లుక్ సరికొత్తగా ఆకట్టుకుంది.
ఈ ఫిమేల్ సెంట్రిక్ సినిమా తర్వాత సమంత నిర్మిస్తున్న మరో మూవీలో టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి (Priyadarshi)ని హీరోగా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మూవీలో సమంత కూడా కీ రోల్ చేస్తున్నట్టు సమాచారం.
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి.. జాతిరత్నాలు, మల్లేశం, బలగం, డార్లింగ్ లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా సమంత ప్రొడక్షన్ హౌస్లో మూవీ చేస్తుండటంతో దర్శి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇకపోతే.. ఖుషీ సినిమా తరువాత మరో కొత్త సినిమాను ప్రకటించలేదు సమంత. నిజానికి ఆమె సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోనీ ఖుషీ సినిమా అయినా అంతగా ఆడింది అంటే అదీ లేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి హనీ బన్నీ (సిటాడెల్) అనే హిందీ సిరీస్ లో సామ్ నటిస్తోంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది.