Samantha: సమానత్వం కనిపించదు.. నింద పడ్డ చోటే పరిష్కారం వెతకాలి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

Samantha: సమానత్వం కనిపించదు.. నింద పడ్డ చోటే పరిష్కారం వెతకాలి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

నటీనటులందరూ ఒకేలా కష్టపడతారు కానీ, వారికి ఇచ్చే పారితోషికాల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుందని హీరోయిన్ సమంత అన్నారు. లేటెస్ట్గా సామ్ ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరై వేతన అసమానతలను ప్రస్తావించింది. కొన్నేళ్లుగా మహిళా నటులు సమాన వేతనం పొందడంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై పెదవి విప్పింది.

ఈ విషయంపై సమంత మాట్లాడుతూ.. "నా కెరీర్లో నేను ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించాను. హీరోతో పాటుగా నేను కూడా సమాన పనిదినాల్లో వర్క్ చేశాను. కానీ, హీరోలకు ఒకలా, లేడీ యాక్టర్స్కి ఒకలా పారితోషికం ఇచ్చారని సమంత తెలిపింది. సినీ పరిశ్రమలో నన్ను ఇబ్బంది పెట్టే విషయంలో ఇది ఒకటి. 

అయితే, కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్‌కు రప్పించగలడు. కాబట్టి అటువంటి హీరోల పాత్రలకు ఇచ్చే పారితోషకాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను.  అది న్యాయం కాదు కూడా. కానీ, కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశ్యం అని సమంత తెలిపింది. 

ALSO READ : Daayra: పృథ్వీరాజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. క్రైమ్ డ్రామా జోనర్లో మూవీ అనౌన్స్

అలాగే, నా ఈ 15 ఏళ్ల అనుభవంలో నేను చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు గడిచినవన్నీ మార్చలేనేమో కానీ, భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. అయినా నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎక్కడైతే నిందలు, బాధలు పడ్డామో అక్కడే పరిష్కారం వెతుక్కోవాలి. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను అని సమంత వెల్లడించింది" అని సమంత చెప్పుకొచ్చింది.

గతంలో చాలా సందర్భంలో సినీ పరిశ్రమలో ఉన్న లింగ సమానత్వ భేదాలపై సామ్ పెదవి విప్పింది. ఈ సారి తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆలోచింపజేసేలా చేసింది. ఇదివరకే చాలా మంది యాక్టర్స్ ఈ విషయంపై మాట్లాడారు. కానీ, ఇప్పటికీ ఈ సమస్య ఇలానే ఉందనే అభిప్రాయాల వ్యక్తం అవుతూ వస్తున్నాయి.