Samantha Instagram: ఇలాంటి ప్రేమ మరొకటి లేదంటూ సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha Instagram: ఇలాంటి ప్రేమ మరొకటి లేదంటూ సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha Instagram: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే సమంత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. 

ఈ స్టోరీలో తన పెంపుడు జంతువు సాషా ని చూపిస్తూ "సాషా ప్రేమలాంటి ప్రేమ మరొకటి లేదని" ఎమోషనల్ వర్డ్స్ రాసింది. అంతేగాకుండా సాషాతో ఆడుకుంటున్న సమయంలో తీసిని వీడియోని షేర్ చేసింది. సమంత కి జంతువులపై అమితమైన ప్రేమ ఉందని అందుకే ఇలా ఎమోషనల్ బాండింగ్ ని వ్యక్తపరుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ఆదివారం నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ తమ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది సేపటిలోనే సమంత ఈ ఎమోషనల్ పోస్ట్ షేర్ చెయ్యడం గమనార్హం. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ | WildFirePushpa: నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు.. తెలుగు కంటే బాలీవుడ్‌లో పుష్ప రికార్డ్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగచైతన్య సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం 4ఏళ్లపాటు కలసి ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ 2022 లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే విడాకుల అనంతరం సమంత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. దీంతో వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లు అంటూ బిజీగా గడుపుతోంది.

కానీ నాగ చైతన్య డిసెంబర్ 4న టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తదితర సినీ పరిశ్రమలనుంచి సెలబ్రెటీస్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.