Samantha: ప్రేమపై నటి సమంత ఎమోషనల్ పోస్ట్.. ప్రేమించడానికి మరో రీజన్ అంటూ..

Samantha: ప్రేమపై నటి సమంత ఎమోషనల్ పోస్ట్.. ప్రేమించడానికి మరో రీజన్ అంటూ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో హెల్త్, లైఫ్ స్టైల్ కి సంబందించిన వీడియోలు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని మోటివేట్ చేస్తో ఉంటుంది. అయితే తాజాగా నటి సమంత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. 

అయితే నటి సమంత తన స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ కుక్క అంధుడైన తన యజమానితో రోడ్డు మీద వెళుతున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడగానే భద్రంగా రోడ్డు దాటిస్తోంది. దీంతో సమంత ఈ వీడియోని షేర్ చేస్తూ కుక్కలని ప్రేమించాడనికి మరొక అద్భుతమైన కారణం అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో సమంత పెట్స్ పై తనుకున్న ప్రేమని వ్యక్త పరిచింది. అయితే సమంత కి ప్రస్తుతం హాష్ మరియు సాషా అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వీటిని సమంత చాలా కేరింగ్ గా చూసుకుంటోంది. పెట్ డాగ్స్ లవ్ గురించి చెబుతూ సమంత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 

ఈ విషయం ఇలా ఉండగా నటి సమంత ఇటీవలే సిటాడెల్: హానీ, బన్నీ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్  ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది. అయితే సమంత తెలుగులో సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో హీరోయిన్ గా అఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.