అమ్మాయిలు వారి జీవితాలకు వాళ్లే హీరోలు: సమంత

అమ్మాయిలు వారి జీవితాలకు వాళ్లే హీరోలు: సమంత

అలియా భ‌‌‌‌ట్, వేదాంగ్  రైనా లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వంలో కరణ్ జోహార్,  అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఏషియ‌‌‌‌న్ సురేష్ ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌పై బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రానా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ సమంత బిగ్ టికెట్‌‌‌‌ను లాంచ్ చేశారు. 

అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘నాకు ఇష్టమైన  హీరోయిన్లు అలియా, సమంత ఇద్దరూ  ఇక్కడే ఉన్నారు.  అలియా ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఫిజికల్‌‌‌‌గానూ కష్టపడిన ఆమెకు ఈ సినిమా  సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.  సమంత మాట్లాడుతూ ‘అలియా నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్లుగా మాపై కొంత బాధ్యత ఉంటుంది. అమ్మాయిలు వారి జీవితాలకు వాళ్లే హీరోలు అని చెప్పేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కథలు రావాలి.  ఓ వైపు నటిస్తూనే.. 

మరో వైపు సినిమాలు నిర్మిస్తున్న అలియాకి ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని  కోరుకుంటున్నా’ అని చెప్పింది.  అలియా భట్ మాట్లాడుతూ ‘ఇది గొప్ప చిత్రం. యాక్షన్, డ్రామా, ఎమోషన్ సహా అన్ని  ఉన్న ఓ ఇంటెన్స్ సినిమా. ఇక  ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌‌‌‌లో సమంత రియల్ హీరో. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది’ అని చెప్పింది. ఈ చిత్రాన్ని తెలుగులో తాను రిలీజ్ చేయడం హ్యాపీ అన్నాడు రానా.  దర్శకుడు వాసన్ బాలా, నటులు వేదాంగ్ రైనా, రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు.