నిర్మాతగా సమంత .. తొలి సినిమా రిలీజ్ కు రెడీ

నిర్మాతగా సమంత  .. తొలి సినిమా రిలీజ్ కు రెడీ

నటిగా సినిమాలకు కొంత గ్యాప్‌‌‌‌ ఇచ్చిన సమంత.. నిర్మాతగా బిజీ అవుతోంది.  త్రలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆమె.. తొలి చిత్రంగా ‘శుభం’ సినిమాను నిర్మిస్తోంది. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్.  ‘సినిమా బండి’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన ప్రవీణ్ కండ్రేగుల దీన్ని తెరకెక్కిస్తున్నాడు.  వసంత్ మరిగంటి కథను అందించాడు.  

తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే థియేటర్స్‌‌‌‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,శ్రావణి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇదొక కామెడీ థ్రిల్లర్. పూర్తి వినోదాత్మకంగా ఉంటూనే పలు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. నైంటీస్ నాటి టెలివిజన్ సెట్స్‌‌‌‌లో టైటిల్, నటీనటులను చూపించడాన్ని బట్టి ఇదొక పీరియాడిక్ బ్యాక్‌‌‌‌డ్రాప్ మూవీ అని అర్థమవుతోంది. తన బ్యానర్‌‌‌‌‌‌‌‌లో తొలి సినిమాగా దీన్ని ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుందని సమంత చెబుతోంది. త్వరలో ఇతర వివరాలను తెలియజేస్తామన్నారు. ఇక ఇదే బ్యానర్‌‌‌‌‌‌‌‌లో తను లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను సమంత ప్రకటించిన విషయం తెలిసిందే.